తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఎకెన్​టాల్ ఛాలెంజర్​ టోర్నీలో రన్నరప్​గా​ రామ్​కుమార్​ - tennis player ramnadhan ramkumar

భారత టెన్నిస్​ ప్లేయర్​ రామ్​కుమార్​ రామనాథన్​.. ప్రతిష్ఠాత్మక ఎకెన్​టాల్​ ఛాలెంజర్​ టోర్నీ ఫైనల్లో ఓడిపోయాడు. కేవలం రన్నరప్​ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు.

ramkumar
రామ్​కుమార్​

By

Published : Nov 9, 2020, 7:45 AM IST

భారత యువ టెన్నిస్‌ ఆటగాడు రామ్‌కుమార్‌ రామనాథన్‌.. ఎకెన్‌టాల్‌ ఛాలెంజర్‌ టోర్నీలో రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తుది పోరులో అన్‌సీడెడ్‌ రామ్‌కుమార్‌ 4-6, 4-6తో ఏడో సీడ్‌ సెబాస్టియన్‌ కొర్డా (అమెరికా) చేతిలో వరుస సెట్లలో ఓడిపోయాడు.

ఈ మ్యాచ్‌లో తొమ్మిది డబుల్‌ఫాల్ట్స్‌ చేసిన అతను. మూడుసార్లు సర్వీస్‌ కోల్పోయి ఓటమి కొనితెచ్చుకున్నాడు. ఛాలెంజర్‌ సర్క్యూట్‌ ఫైనల్లో పరాజయం పాలవడం రామనాథన్‌కు కెరీర్‌లో ఇది అయిదోసారి. గతంలో అతను టాల్‌హాస్‌, విన్నెటా, పుణె (2017), తైపీ (2018) టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచాడు.

ఇదీ చూడండి : ఆ జాబితాలో రోహిత్​ను దాటేసిన ధావన్

ABOUT THE AUTHOR

...view details