తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెన్నిస్​ భామకు ​'డేటింగ్'​ వినతుల వెల్లువ - Genie Bouchard images

కెనడా టెన్నిస్​ ప్లేయర్​ గినీ బౌచర్డ్​.. తాజాగా చేసిన ఓ ట్వీట్​ వైరల్​గా మారింది. కరోనా నేపథ్యంలో ఆమె చేసిన పోస్టుకు నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. అంతేకాకుండా డేటింగ్ కోసం​ పెద్ద ఎత్తున వినతులు పంపుతున్నట్లు గినీ తెలిపింది.

Tennis player Genie Bouchard getting unstoppable Dating Resumes after Amid Quarantine
టెన్నిస్​ ప్లేయర్​కు​ వెళ్లువెత్తుతున్న డేటింగ్​ వినతులు

By

Published : Mar 24, 2020, 11:06 AM IST

Updated : Mar 24, 2020, 11:14 AM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో పలు టోర్నీలు రద్దయ్యాయి. ఈ సందర్భంలో అనేక మంది క్రీడాకారులు తమ ఇళ్లకే పరిమితమై స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. ఖాళీ సమయాల్లో ఏం చేయాలో తెలియక కొందరు సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో ముచ్చట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే కెనడాకు చెందిన టెన్నిస్‌ తార, 2014 వింబుల్డన్‌ రన్నరప్‌ గినీ బౌచర్డ్‌ చేసిన ఓ సరదా ట్వీట్‌కు విచిత్రమైన స్పందన లభించింది.

కెనడా టెన్నిస్​ ప్లేయర్​ గినీ బౌచర్డ్​

నెటిజన్లతో చాటింగ్‌ చేద్దామని భావించిన గినీ.. శనివారం ఓ సరదా ట్వీట్‌ చేసింది. " ఎవరినీ ఉద్దేశించట్లేదు కానీ, క్వారంటైన్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో ఉంటే మరింత బాగుంటుంది" అని పోస్టు చేసింది. ఇందుకు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆమె చేసిన ట్వీట్‌లోని ఈమెయిల్‌కు ఎక్కువ సంఖ్యలో 'డేటింగ్‌ రెజ్యూమేలు' పంపించారు. ఈ విషయాన్ని తన మేనేజర్‌ చెప్పాడని, ఇకపై తనకు అలాంటి వినతులు పంపొద్దని మరో ట్వీట్‌లో కోరింది. ఈమెకు సామాజిక మాధ్యమాల్లో మంచి ఫాలోయింగ్​ ఉంది. గతంలోనూ ఈ అమ్మడు పెట్టిన పలు బికినీ ఫొటోలు.. నెట్టింట వైరల్​ అయ్యాయి.

టెన్నిస్​ ప్లేయర్​ గినీ బౌచర్డ్​
టెన్నిస్​ ప్లేయర్​ గినీ బౌచర్డ్​

వైరస్‌ మహమ్మారి కారణంతో టెన్నిస్‌ రంగంలో ఏటీపీ, డబ్ల్యూటీఏ టోర్నీలు, ఫ్రెంచ్‌ ఓపెన్‌ వాయిదా పడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 3 లక్షల 81వేలకు పైగా కేసులు నమోదు కాగా... 1 లక్షా 2 వేలకు పైగా బాధితులు చికిత్స పొంది క్షేమంగా ఉన్నారు. 16వేల 558 మంది మృతిచెందారు.

Last Updated : Mar 24, 2020, 11:14 AM IST

ABOUT THE AUTHOR

...view details