ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ నిర్వహించడానికి టెన్నిస్ ఆస్ట్రేలియా భారీగానే ఖర్చు చేస్తోంది. కరోనా కారణంగా.. ఈసారి ఆటగాళ్లను క్వారంటైన్‌లో ఉంచడం, వారికి ఏమీ కాకుండా ప్రత్యేకంగా అనేక జాగ్రత్తల చర్యలు తీసుకోవడమే అధికంగా ఖర్చు అవ్వడానికి కారణం. అయితే దీని కోసం 4 కోట్ల డాలర్లు ఖర్చవుతుందని.. ఆ మొత్తం తామే భరిస్తామని చెప్పారు టెన్నిస్ ఆస్ట్రేలియా చీఫ్ క్రెయిగ్ టైలీ. గతంలో ఈ మొత్తాన్ని విక్టోరియా ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన ఆయన.. తాజాగా దీనికి సంబంధించి స్పష్టత ఇచ్చారు.
అంతకముందు.. విదేశాల నుంచి వచ్చిన ఆటగాళ్ల క్వారంటైన్ ఖర్చును ప్రభుత్వం భరిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని విక్టోరియా రాష్ట్ర మంత్రి లీసా నెవిల్ అన్నారు. దీంతో ఆ మొత్తాన్ని తామే భరిస్తామని టెన్నిస్ ఆస్ట్రేలియా తెలిపింది.