యూఎస్ ఓపెన్ నుంచి వైదొలిగే స్టార్ క్రీడాకారుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో ఇద్దరు టాప్-10 క్రీడాకారిణులు ఈ టోర్నీ నుంచి తప్పుకున్నారు. ఐదో ర్యాంకర్ స్వితోలినా, ఏడో ర్యాంకర్ బెర్టిన్స్ ఆడట్లేదని ప్రకటించారు.
యూఎస్ ఓపెన్ నుంచి మరో ఇద్దరు స్టార్స్ ఔట్ - US Open news
టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఈ మెగాటోర్నీ నుంచి టాప్ క్రీడాకారులు తప్పుకోగా.. తాజాగా మరో ఇద్దరు అదే జాబితాలో చేరారు.
యుఎస్ ఓపెన్ నుంచి స్వితోలినా, బెర్టిన్స్ ఔట్
ప్రపంచ నంబర్ వన్ ఆష్లె బార్టీతో పాటు రఫెల్ నాదల్, నిక్ కిర్గియోస్, వావ్రింకా, మోన్ఫిల్స్ ఇప్పటికే యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకున్నారు. ఆగస్టు 31న ఈ టోర్నీ ఆరంభం కానుంది.
Last Updated : Aug 8, 2020, 10:27 AM IST