కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయిన ఆటలన్నీ ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత నంబర్‌వన్ పురుషుల సింగిల్స్ టెన్నిస్ ఆటగాడు సుమిత్ నగాల్ టోర్నీలో ఆడడమే కాకుండా ట్రోఫీ సొంతం చేసుకున్నాడు.
సంక్షోభంలో విజేతగా నిలిచిన తొలి భారత క్రీడాకారుడు
అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీలో విజేతగా నిలిచాడు సుమిత్ నగాల్. తద్వారా కరోనా కాలంలో ట్రోఫీ సాధించిన తొలి భారత ఆటగాడిగా ఘనత వహించాడు. జర్మనీలో జరిగిన టెన్నిస్ టోర్నీ పీఎస్‌డీ బ్యాంక్ నార్డ్ ఓపెన్ ట్రోఫీ ఫైనల్లో స్థానిక ఆటగాడు డేనియల్‌ను ఓడించాడు సుమిత్.
సంక్షోభంలో విజేతగా నిలిచిన తొలి భారత క్రీడాకారుడు
కరోనా కాలంలో అంతర్జాతీయ టోర్నీలో గెలిచిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు సుమిత్. జర్మనీలో జరిగిన పీఎస్‌డీ బ్యాంక్ నార్డ్ ఓపెన్ ట్రోఫీ టెన్నిస్ టోర్నీ ఫైనల్లో సుమిత్ 6-1, 6-3 తేడాతో స్థానిక ఆటగాడు డేనియల్‌ను ఓడించాడు. ఆ దేశంలోనే శిక్షణ పొందుతున్న సుమిత్ తనకు దగ్గర్లోనే ఈ క్లే కోర్టు టోర్నీ జరగడం వల్ల అందులో పాల్గొని విజయం సాధించాడు.