ఫ్రెంచ్ ఓపెన్ ముంగిట రఫెల్ నాదల్‌కు చుక్కెదురైంది. ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి బరిలో దిగిన ఈ స్పెయిన్ స్టార్.. ఇటాలియన్ ఓపెన్లో అనూహ్యంగా ఓడిపోయాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌ఫైనల్లో నాదల్ 2-6, 5-7తో డిగో స్క్వాట్జ్‌మ్యాన్ చేతిలో వరుస సెట్లలో పరాజయం చవిచూశాడు. తొమ్మిదిసార్లు ఇటాలియన్ ఓపెన్ ఛాంపియన్ అయిన రఫా.. డిగోతో తలపడ్డ గత తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓడిపోలేదు. సర్వీసుల్లో బలహీనంగా కనిపించిన నాదల్.. అనవసర తప్పిదాలతో ఓటమి కొని తెచ్చుకున్నాడు.
"ఈ ఏడాది ఊహకందనిదిగా ఉంది. లాక్‌డౌన్ వల్ల రెండు నెలలు రాకెట్‌ను ముట్టుకోలేదు. ఈ టోర్నీలో కనీసం మూడు మ్యాచ్‌లైనా గెలవగలిగాను" అని పరాజయం అనంతరం రఫా అన్నాడు.
ఫైనల్‌కు జకోవిక్