తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఏటీపీ ఫైనల్స్'​ విజేతగా గ్రీస్ స్టార్ స్టెఫానో సిట్సిపాస్​ - Stefanos Tsitsipas beats Dominic Thiem in thriller to lift ATP Finals trophy

లండన్ వేదికగా జరిగిన ఏటీపీ ఫైనల్స్ విజేతగా గ్రీస్ టెన్నిస్ క్రీడాకారుడు స్టెఫానో సిట్సిపాస్ నిలిచాడు. తుదిపోరులో డోమనిక్ థీమ్​పై విజయం సాధించాడు.

స్టెఫానో సిట్సిపాస్

By

Published : Nov 18, 2019, 11:12 AM IST

'ఏటీపీ ఫైనల్స్'​ విజేతగా గ్రీస్ స్టార్ స్టెఫానో సిట్సిపాస్​

గ్రాండ్​స్లామ్​ తర్వాత అంతటి ప్రతిష్టాత్మక టోర్నీ అయిన ఏటీపీ ఫైనల్స్ విజేతగా గ్రీస్​ టెన్నిస్ స్టార్ స్టెఫానో సిట్సిపాస్ నిలిచాడు. లండన్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రియా ప్లేయర్ డోమనిక్ థీమ్​పై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయాడు.

థీమ్​పై 6-7(6), 6-2, 7-6(4) తేడాతో గెలిచాడు సిట్సిపాస్. ఈ టైటిల్ నెగ్గిన తొలి ఆస్ట్రియన్​గా రికార్డు సృష్టించాడు. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన స్టెఫానో తొలి సెట్​లో పరాజయం చెందాడు. అయితే ఆ తర్వాతి రెండు, మూడు సెట్లలో గెలిచి టైటిల్​ సొంతం చేసుకున్నాడు.

ఏటీపీ ఫైనల్స్​ టోర్నీలో కొత్త ఆటగాళ్లు విజేతగా నిలవడం వరుసగా ఇది నాలుగోసారి కావడం విశేషం.

అతిపిన్న వయస్కుడిగా..

1991 తర్వాత అరంగేట్ర టోర్నీలో ఫైనల్​కు వెళ్లిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు స్టెఫానో సిట్సిపాస్. అంతకుముందు అమెరికా క్రీడాకారుడు జిమ్​ కొరియర్ పేరిట ఈ ఘనత ఉంది. ఏటీపీ ఫైనల్స్​ టైటిల్ నెగ్గిన సిట్సిపాస్ 2.6 మిలియన్ డాలర్లు(రూ. 18కోట్లు) ప్రైజ్ మనీ దక్కించుకున్నాడు.

సెమీస్​లో ఫెదరర్​కు షాక్​..

పురుషుల సింగిల్స్​లో అత్యధిక గ్రాండ్​స్లామ్​లను కైవసం చేసుకున్న రోజర్​ ఫెదరర్​ను సెమీస్​లో ఓడించి షాకిచ్చాడు సిట్సిపాస్.

ఇదీ చదవండి: టీ20 సిరీస్​లలో రెండేళ్లుగా ఓటమెరుగని అఫ్గాన్​

ABOUT THE AUTHOR

...view details