తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండు నెలల తర్వాత జకోవిచ్‌ చేతిలో రాకెట్! - జకోవిచ్ టెన్నిస్ ప్లేయర్

లాక్​డౌన్​ ఆంక్షల సడలింపు నేపథ్యంలో స్టార్​ టెన్నిస్ ప్లేయర్​ జకోవిచ్​ మళ్లీ కోర్టులో అడుగుపెట్టనున్నాడు. త్వరలో ఆడ్రియా టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్లు ఇతడు​ వెల్లడించాడు.

star tennis player Novak Djokovic
రెండు నెలల తర్వాత జకోవిచ్‌ రాకెట్​ పడుతున్నాడు!

By

Published : May 27, 2020, 6:51 AM IST

కరోనా ప్రభావంతో రెండు నెలలు స్పెయిన్‌లో చిక్కుకుపోయిన అగ్రశ్రేణి టెన్నిస్‌ ఆటగాడు నోవాక్‌ జకోవిచ్..‌ ఎట్టకేలకు స్వదేశం సెర్బియాకు చేరుకున్నాడు. తన సోదురుడిని చూసేందుకు కుటుంబంతో సహా మార్చిలో స్పెయిన్‌ వెళ్లిన ఈ ప్లేయర్.. లాక్‌డౌన్‌ విధించడం వల్ల అక్కడే ఉండిపోయాడు. తాజాగా సెర్బియా చేరుకోగానే తన టెన్నిస్‌ కాంప్లెక్స్‌లో మీడియాతో మాట్లాడాడు. లాక్‌డౌన్‌ వేళ తాను ఫిట్‌గానే ఉన్నానని, ప్రతి రోజూ టెన్నిస్‌ కోర్టులో ప్రాక్టీస్‌ చేశానని చెప్పాడు. ఈ విరామ సమయంలో సాధనకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని, తామున్న మార్బెల్లా రిసార్ట్‌లో టెన్నిస్‌ కోర్టు ఉందన్నాడు. అయితే, తన ప్రాక్టీస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోడానికి ఇష్టపడలేదని, అలా చేసి ఇతరులను ఇబ్బంది పెట్టదల్చుకోలేనని జకో పేర్కొన్నాడు.

ఆడ్రియా టూర్​కు సిద్ధం

జూన్‌ 13 నుంచి జులై 5వరకు బాల్కన్స్‌లో తన ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 'ఆడ్రియా టూర్'‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ టోర్నీ నిర్వహించడం తనకు సంతోషంగా ఉందని, అదీ ప్రభుత్వ నిబంధనలకు లోబడే ఉంటాయని చెప్పాడు. ఈ టోర్నీలో తనతో పాటు మరో ముగ్గురు టాప్‌ ఆటగాళ్లు డొమినిక్‌ థీమ్‌, గ్రిగోర్‌ దిమిత్రోవ్‌, అలెగ్జాండర్‌ జ్వెరెవ్​‌ పాల్గొంటారని స్పష్టం చేశాడు.

తన ప్రధాన పోటీదారులు రోజర్‌ ఫెదరర్‌, రఫెల్‌ నాదల్‌ను ఆహ్వానిస్తున్నారా? అన్న ప్రశ్నకు జకోవిచ్‌ స్పందించాడు. ఫెదరర్‌ మోకాలి గాయంతో బాధపడుతుండటం వల్ల అతడిని పిలవాలనుకోవట్లేదని చెప్పాడు. నాదల్‌ను ఆహ్వానించడంలో తనకెలాంటి ఇబ్బందీ లేదని, అయితే.. అతనొస్తాడని మాత్రం అనుకోవట్లేదని వివరించాడు.

కరోనా‌ విజృంభణ కారణంగా ఫిబ్రవరి నుంచి ఎలాంటి టెన్నిస్‌ పోటీలు జరగడంలేదు. అంతకుముందే జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్ పురుషుల సింగిల్స్‌ విభాగంలో జకోవిచ్ విజేతగా నిలిచాడు.

ABOUT THE AUTHOR

...view details