తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సానియా కుమారుడికి యూకే వీసా ఇవ్వండి' - క్రీడా మంత్రిత్వ శాఖ

తన కుమారుడి యూకే వీసా కోసం క్రీడా మంత్రిత్వ శాఖను కలిసింది భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా. ఒలింపిక్స్​కు ముందు ఇంగ్లాండ్​లోని పలు టోర్నీల్లో సానియా పాల్గొనాల్సి ఉంది. ఈ పర్యటనకు తన రెండేళ్ల కుమారుడిని తీసుకెళ్లాలనుకుంది. కానీ, బాలుడితో పాటు కేర్​టేకర్​కు వీసా అనుమతి రాలేదు.

sania mirza, indian tennis player
సానియా మీర్జా, భారత టెన్నిస్ క్రీడాకారిణి

By

Published : May 19, 2021, 10:51 PM IST

టోక్యో ఒలింపిక్స్​కు ముందు భారత స్టార్​ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా పలు టోర్నీల్లో పాల్గొననుంది. కుమారుడితో కలిసి ఈ పర్యటనకు వెళ్లాలనుకున్న సానియాకు కొత్త చిక్కు వచ్చిపడింది. ఆమె కొడుకుతో పాటు కేర్​టేకర్​కు యూకే వీసా అనుమతి లభించలేదు. ఈ విషయంపై క్రీడా మంత్రిత్వ శాఖను కలిసిందీ టెన్నిస్​ స్టార్.

నాటింగ్​హామ్​ ఓపెన్​(జూన్​ 6 నుంచి)​, బర్మింగ్​హామ్​ ఓపెన్(జూన్​ 14 నుంచి)​, ఈస్ట్​బౌర్న్​ ఓపెన్​(జూన్​ 20 నుంచి), వింబుల్డన్​​(జూన్​ 28 నుంచి).. టోక్యో ఒలింపిక్స్​కంటే ముందు జరగనున్నాయి. వీటిల్లో పాల్గొనడానికి సానియాకు వీసా మంజూరైంది.

"టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకంలో భాగమైన సానియా.. టోక్యో ఒలింపిక్స్​కు ముందు ఇంగ్లాండ్​లో పలు టోర్నీలు ఆడాల్సి ఉంది. కానీ, తన కుమారుడితో పాటు కేర్​టేకర్​కి వీసా మంజూరు కాలేదు. కొడుకుని విడిచి నెల రోజుల పాటు ఉండలేనని సానియా.. క్రీడా శాఖకు విజ్ఞప్తి చేసింది. ఈ విషయంపై విదేశీ వ్యవహారాల శాఖకు ఓ లేఖను రాశాం. లండన్​లోని భారత రాయబార కార్యలయం ద్వారా యూకే ప్రభుత్వాన్ని వీసా అనుమతికి అంగీకరించాల్సిందిగా విన్నవించాం" అని క్రీడా మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇదీ చదవండి:'రౌడీ బేబీ' పాటతో.. వార్నర్ ఈజ్ బ్యాక్

ABOUT THE AUTHOR

...view details