తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆస్ట్రేలియన్​ ఓపెన్​కు కరోనా సెగ- నిర్బంధంలోనే ఆటగాళ్లు

ఆస్ట్రేలియన్​ ఓపెన్​ను కరోనా కలవరపెడుతోంది. తాజాగా మరో కొవిడ్ కేసు బయటపడింది. దీంతో స్వీయ నిర్భందంలోకి వెళ్లిన ఆటగాళ్ల సంఖ్య 72కి చేరింది. టోర్నీ నిర్వహణకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కేసులు పెరగడం ఆందోళన రేకేత్తిస్తుంది.

SPO-TENNIS-OPEN-VIRUS
ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో ఐదుకు చేరిన కరోనా కేసులు

By

Published : Jan 18, 2021, 12:44 PM IST

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో కరోనా కేసుల సంఖ్య ఐదుకు పెరిగింది. దీంతో స్వీయ నిర్భందంలోకి వెళ్లిన ఆటగాళ్ల సంఖ్య 72కి చేరింది. ఫిబ్రవరి 8న టోర్నీ జరగనున్న నేపథ్యంలో కేసుల సంఖ్య పెరుగుతుండడం కలకలం రేపుతోంది.

ఖతార్​ దోహా నుంచి ఆతిథ్య దేశానికి వచ్చిన విమానంలో తాజాగా కొవిడ్​ కేసు వెలుగు చూసింది. ఇందులో 25 మంది ఆటగాళ్లు సహా మొత్తం 58 మంది ఉన్నారు. వారందరూ ప్రస్తుతం హోటల్​ గదులకే పరిమితమయ్యారు. వీరిని 14 రోజుల పాటు బయటకు అనుమతించమని టోర్నీ నిర్వాహకులు తెలిపారు.

ఇప్పటికే 47 మంది ప్లేయర్లు క్వారంటైన్​లో ఉన్నారు. ముప్పు తక్కువగా ఉన్న ప్లేయర్ల ప్రాక్టీస్​ మ్యాచ్​ల కోసం రోజూ ఐదు గంటల సమయాన్ని ఇవ్వనున్నట్లు టోర్నీ నిర్వాహకులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఆస్ట్రేలియా 294 ఆలౌట్​.. భారత్​ లక్ష్యం 328

ABOUT THE AUTHOR

...view details