భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు.. ఫ్రెంచ్ ఓపెన్(French Open 2021) సూపర్ 750 టోర్నీపై దృష్టిసారించింది. డెన్మార్క్ ఓపెన్‌లో క్వార్టర్‌పైనల్లో నిరాశపరిచిన సింధు.. ఫ్రెంచ్ ఓపెన్‌లో(French Open 2021) టైటిల్‌పై గురి పెట్టింది. మంగళవారం ప్రారంభంకానున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో జూలీ జాకోబ్సెన్తో (డెన్మార్క్) మూడో సీడ్ సింధు తలపడుతుంది.
French Open 2021: ఫ్రెంచ్ ఓపెన్‌పై సింధు గురి - ఫ్రెంచ్ ఓపెన్‌లో 2021
డెన్మార్క్ ఓపెన్‌లో క్వార్టర్‌పైనల్లో నిరాశపరిచిన పి.వి సింధు.. ఫ్రెంచ్ ఓపెన్‌లో(French Open 2021) టైటిల్‌పై గురి పెట్టింది. మంగళవారం ప్రారంభంకానున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో జూలీ జాకోబ్సెన్తో సింధు తలపడనుంది.
ఫ్రెంచ్ ఓపెన్‌పై సింధు గురి
మరో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో సయాక తకహాషితో(జపాన్) పోటీ పడుతుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ కెంటొ మొమొటతో(జపాన్స్) శ్రీకాంత్, లక్ష్యసేన్‌తో సాయి ప్రణీత్, జొనాథన్ క్రిస్టీతో(ఇండోనేసియా) సమీర్‌వర్మ, బ్రైస్ లెవెర్‌దెజ్‌తో(ఫ్రాన్స్) కశ్యప్ తలపడతారు.