మంగళవారం నుంచి జరగబోయే టొయోటా థాయ్‌లాండ్ ఓపెన్‌లో అంచనాల మేరకు రాణిస్తామని భారత షట్లర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. వారం క్రితం జరిగిన యోనెక్స్ థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు అత్యంత చెత్త ప్రదర్శన చేశారు. ఏ ఒక్క క్రీడాకారుడు కనీసం రెండో రౌండ్ దాటలేదు.
టోక్యో ఒలింపిక్స్ పతక పోటీదారు అయిన సింధు గత రెండు నెలలుగా లండన్‌లో శిక్షణ తీసుకుంది. ఆమె తొలి గేమ్‌లో ప్రపంచ 12వ సీడ్ బుసానన్‌తో తలపడనుంది. గత టోర్నీలో సైనాను, బుసానన్ ఓడించింది. ఇటీవల కొవిడ్ నుంచి కోలుకున్న సైనా ఈ టోర్నీలోనైనా ఆకట్టుకుంటుందేమో చూడాలి. ఆమె మొదటి మ్యాచ్‌లో నాల్గవ సీడ్ క్రీడాకారిణి రాట్చానోక్ ఇంటానాన్ను ఎదుర్కోనుంది.