తెలంగాణ

telangana

ETV Bharat / sports

వింబుల్డన్​: సెరెనాపై హలెప్ సంచలన విజయం - halep

వింబుల్డన్​-2019 విజేతగా అవతరించింది రొమేనియా క్రీడాకారిణి హలెప్ . ఫైనల్లో సెరెనాపై సంచలన విజయం సాధించింది.

వింబుల్డన్

By

Published : Jul 13, 2019, 8:42 PM IST

వింబుల్డన్​ ఫైనల్​లో సంచలనం నమోదైంది. టెన్నిస్ అగ్ర క్రీడాకారిణి సెరెనా విలియమ్స్​పై రొమేనియా క్రీడాకారిణి హలెప్ అద్భుత విజయం సాధించింది. తుదిపోరులో 6-2, 6-2 తేడాతో వరుస సెట్లు కైవసం చేసుకుని విజేతగా నిలిచింది. ఫలితంగా తొలిసారిగా వింబుల్డన్ టైటిల్ గెలిచింది.

సెరెనా, హలెప్

24 గ్రాండ్​స్లామ్​లు గెలిచి మార్గరెట్ కోర్ట్ రికార్డును సమం చేద్దామనుకున్న సెరెనా ఆశలు ఆవిరయ్యాయి. ఎవరూ ఊహించని రీతిలో రొమేనియా క్రీడాకారిణి హలెప్వింబుల్డన్​టైటిల్ గెలిచింది. ఇది సెరెనాకు 11వ వింబుల్డన్ ఫైనల్​కాగా.. హలెప్​కు మొదటిది కావడం విశేషం.

పురుషుల సింగిల్స్​ ఫైనల్ రేపు జరుగనుంది. ఈ పోరులో ఫెదరర్, జకోవిచ్​ అమీతుమీ తేల్చుకోనున్నారు.

ఇవీ చూడండి.. 'రఫాతో మ్యాచ్ అదుర్స్.. జకోతో కష్టమే'

ABOUT THE AUTHOR

...view details