తెలంగాణ

telangana

ETV Bharat / sports

మరో టైటిల్​పై కన్నేసిన సెరెనా విలియమ్స్ - సెరెనా విలియమ్స్

టోరంటో టోర్నమెంట్​ తొలి రౌండ్​లో ప్రముఖ మహిళా టెన్నిస్​ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్​ విజయం సాధించింది. టైటిల్​ కొట్టాలనే ఉత్సాహంతో బరిలోకి దిగిందీ ప్లేయర్.

మరో టైటిల్​పై కన్నేసిన సెరెనా విలియమ్స్

By

Published : Aug 9, 2019, 5:41 AM IST

కెనడాలో జరుగుతున్న టోరంటో టోర్నమెంట్​ తొలి రౌండ్​లో అద్భుత విజయం సాధించింది మహిళా టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్. బెల్జియంకు చెందిన 20వ ర్యాంకర్​ ఎలైస్ మెర్టిన్స్​పై 6-3, 6-3 పాయింట్ల తేడాతో గెలిచింది.ఇప్పటికే ఈ టోర్నీలో 2001, 2011, 2013లో విజేతగా​ గెలిచిన 10వ ర్యాంకర్​ సెరెనా.. మరో టైటిల్ దక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. వింబుల్డన్​ ఫైనల్లో ఓటమి తర్వాత సెరెనా గెలిచిన తొలి మ్యాచ్​ ఇదే.

టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్

"నా ఫిట్​నెస్​పై ప్రస్తుతం దృష్టి సారిస్తున్నాను. ఇప్పుడు గాయాలేమి లేవు. రోజు రోజుకూ నా ఆటను మరింత మెరుగుపరుచుకుంటున్నాను." -సెరెనా విలియమ్స్

తన తర్వాతి మ్యాచ్​లో రష్యాకు చెందిన ఎక్తరినా అలెగ్జాండ్రోవాతో తలపడనుంది అమెరికన్​ టెన్నిస్ స్టార్.

ఇది చదవండి: వింబుల్డన్​: సెరెనాపై హలెప్ సంచలన విజయం

ABOUT THE AUTHOR

...view details