తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇటాలియన్​ ఓపెన్​కు దూరమైన సెరెనా విలియమ్స్​

యూఎస్​ ఓపెన్​లో సెమీఫైనల్​ వరకు వెళ్లిన సెరెనా విలియమ్స్​... ఇటాలియన్​ ఓపెన్​కు దూరమైంది. గాయం కారణంగా ఈ పోటీల్లో పాల్గొనట్లేదని స్పష్టం చేసింది. సెప్టెంబర్​ 14 నుంచి ఇటాలియన్​ ఓపెన్​ టోర్నీ ప్రారంభం కానుంది.

Italian Open
ఇటాలియన్​ ఓపెన్​కు దూరమైన సెరేనా విలియమ్స్​

By

Published : Sep 13, 2020, 12:27 PM IST

కరోనా తర్వాత రాకెట్​ పట్టిన అమెరికా టెన్నిస్​ ప్లేయర్ సెరెనా విలియమ్స్​.. రెండు టోర్నీలైనా ఆడకముందే మళ్లీ ​బ్రేక్​ ఇచ్చింది. గాయం కారణంగా ఇటాలియన్​ ఓపెన్​కు దూరమైనట్లు ప్రకటించింది. సెప్టెంబర్​ 14 నుంచి 21 వరకు ఈ టోర్నీ ప్రేక్షకులు లేకుండా జరగనుంది.

చీలమండ గాయం వల్ల యూఎస్​ ఓపెన్​ సెమీఫైనల్​ మ్యాచ్​లోనూ ఇబ్బందిపడింది సెరెనా. టోర్నీ ఆసాంతం బాగానే రాణించిన ఈ స్టార్​ ప్లేయర్​.. సెమీస్​​లో 6-1, 3-6, 3-6 తేడాతో అజరెంక చేతిలో ఓడిపోయింది. ఫలితంగా మార్గరెట్​ కోర్ట్(24) పేరిట ఉన్న గ్రాండ్​స్లామ్​ టైటిళ్ల రికార్డును ఈ ఏడాదీ అందుకోలేకపోయింది. ప్రస్తుతం 23 టైటిళ్లతో తర్వాతి స్థానంలోనే ఉంది సెరెనా.

నాదల్​ మళ్లీ..

ప్రపంచ రెండో ర్యాంకర్​ రఫేల్​ నాదల్​ పురుషుల విభాగంలో ఫేవరెట్​గా బరిలోకి దిగనున్నాడు. ఫిబ్రవరిలో మెక్సికన్​ ఓపెన్​ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు రాకెట్​ పట్టనున్నాడు.

ప్రపంచ ఆరో ర్యాంకర్, 2019 యూఎస్​ ఓపెన్ మహిళల సింగిల్స్​​ విజేత​ బియాన్సా ఆండ్రెస్కు కూడా ఈ టోర్నీలో పాల్గొనట్లేదు. యూఎస్​ ఓపెన్-2020లో ఫైనల్​ చేరిన డొమినిక్​ థీమ్​, అలెగ్జాండర్​ జ్వెరెవ్​ కూడా ఇటాలియన్​ ఓపెన్​లో ఆడట్లేదు.

ABOUT THE AUTHOR

...view details