తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెన్నిస్​ స్టార్​ సెరెనాకు భారీ జరిమానా - అమెరికన్ టెన్నిస్ స్టార్

అమెరికన్​ స్టార్​ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ భారీ జరిమానా పడింది. దాదాపు రూ. 6 లక్షల 85 వేలు చెల్లించాలని వింబుల్డన్​ నిర్వాహకులు ఆదేశించారు.

సెరెనా విలియమ్స్

By

Published : Jul 10, 2019, 2:35 PM IST

వింబుల్డన్​ టైటిల్​ ఫేవరెట్​ సెరెనా విలియమ్స్​కు భారీ జరిమానా విధించారు అధికారులు. ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ కోర్టులలో ఒకదాన్ని తన రాకెట్‌తో పాడుచేయడమే కారణమని వెల్లడించారు. ఫలితంగా 7సార్లు ఛాంపియన్ షిప్ గెలిచిన ఈ టెన్నిస్ ప్లేయర్... దాదాపు రూ. 6 లక్షల 85 వేలు (10వేల డాలర్లు) జరిమానా కట్టాల్సిందిగా ఆదేశాలు అందాయి.

జూన్​ 30న ప్రాక్టీస్​ సెషన్​లో పాల్గొన్న సెరెనా... రాకెట్​తో టెన్నిస్​ కోర్టును ధ్వంసం చేసిందని అధికారులు పేర్కొన్నారు. ఒక క్రీడాకారిణిగా ప్రవర్తించలేదని ఆరోపించారు. దీనిపై విలియమ్స్​ వివరణ ఇచ్చింది.

"నిజంగా ఇలాంటి ఘటన ఎదురవుతుందని ఊహించలేదు. ఆ రోజు నా రాకెట్​ను విసిరానంతే. దానికే ఫైన్​ పడింది".
--సెరెనా విలియమ్స్​, టెన్నిస్​ తార.

గతంలోనూ కోర్టు పాడు చేసినందుకు ఇదే విధంగా ఫైన్​ ఎదుర్కొంది సెరెనా. నేడు జరగనున్న సెమీఫైనల్​లో అమెరికన్​ క్రీడాకారిణి అలిసన్​ రిస్కేతో తలపడనుంది.

ABOUT THE AUTHOR

...view details