చైనా మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారి జాంగ్‌పై లైంగిక హింస ఆరోపణలు చేసినప్పటి నుంచి కనిపించకుండా పోయిన ఆ దేశ టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి(Peng Shuai Missing) ఆచూకీ కోసం సాగుతున్న ఉద్యమం ఉద్ధృతమైంది. ఇప్పటికే పెంగ్(peng shuai twitter) ఎక్కడ? అని సామాజిక మాధ్యమాల్లో సాధారణ ప్రజల దగ్గర నుంచి ప్రముఖుల వరకు అందరూ ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు ఆమె సురక్షితంగానే ఉన్నానని, చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని పెంగ్ నుంచి వచ్చిన ఈ మెయిల్‌పై డబ్ల్యూటీఏ ఛైర్మన్ సిమన్ అనుమానాలు వ్యక్తం చేసింది. ఆమె ఆచూకీ దొరకకపోతే చైనాతో తమ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకునేందుకూ వెనకాడబోమని అతను హెచ్చరించాడు.
మౌనంగా ఉండకూడదు: సెరెనా
చైనా స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి కనిపించకపోవడంపై అటు అభిమానులు, ఇటు తోటి క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై గతంలో ఇదివరకే జకోవిచ్ (సెర్బియా), నవోమీ ఒసాక (జపాన్) స్పందించగా తాజాగా అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్(Serena News) కూడా ఆ జాబితాలో చేరారు. షువాయి అదృశ్యం వార్త తెలుసుకొని దిగ్భ్రాంతికి గురైనట్లు ట్వీట్ చేసింది. ఆమె క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు సెరీనా పేర్కొంది. ఈ విషయంలో మౌనంగా ఉండకుండా తగిన విచారణ జరిపించాలని కోరింది.
మరోవైపు పెంగ్ షువాయి ఎక్కడంటూ ప్రపంచం మొత్తం ప్రశ్నిస్తున్నా చైనా మాత్రం పెదవి విప్పడం లేదు. ఆ దేశ మాజీ సీనియర్ వైస్ ప్రీమియర్ జాంగ్ గవోలి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఈ నెల 2న షువాయి సంచలన ఆరోపణలు చేసింది. కానీ ఆ తర్వాత నుంచి ఆమె కనిపించడం లేదు. దీంతో పెంగ్ షువాయి ఎక్కడంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రజలు, క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, గురువారం డబ్ల్యూటీఏ ఛైర్మన్ స్టీవ్ సిమన్‌కు షువాయి ఓ ఈ మెయిల్ చేసినట్లు చైనా మీడియా సంస్థ ఒకటి ట్విట్టర్‌లో పోస్టు చేసింది. తాను క్షేమంగానే ఉన్నానని, గతంలో తాను చేసిన ఆరోపణలన్నీ అబద్దమని పేర్కొంటూ ఆమె పంపిన మెయిల్‌పై సందేహాలు రేకెత్తుతున్నాయని సిమన్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇదీ చదవండి:
టెన్నిస్ ప్లేయర్ మాయం.. ఆమె ఎక్కడ అని ఒసాక ట్వీట్