టెన్నిస్ స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ రెండేళ్ల కుమార్తె ఒలింపియా అరుదైన ఘనత సాధించింది. అతి తక్కువ వయసులోనే ఓ ఫుట్‌బాల్ జట్టుకు సహయజమానిగా నిలిచి రికార్డు సృష్టించింది.
లాస్ ఏంజెల్స్‌కు చెందిన మహిళా ఫుట్‌బాల్ జట్టుకు సెరెనా విలియమ్స్, ఆమె భర్త అలెక్సిస్ ఓహానియన్, కుమార్తె ఒలింపియా సహ యజమానులుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ టీమ్‌ను ఏంజెల్ సిటీ అని పిలుస్తున్నారు.