తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇటాలియన్​ ఓపెన్ నుంచి సెరెనా ఔట్

ఇటాలియన్​ ఓపెన్​లో అమెరికా టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ ఓటమిపాలైంది. అర్జెంటినాకు చెందిన నదియా పొదరోస్కా చేతిలో కంగుతింది.

serena williams
సెరెనా విలియమ్స్, ఇటాలియన్ ఓపెన్

By

Published : May 13, 2021, 7:25 AM IST

ఇటాలియన్‌ ఓపెన్‌లో అమెరికా టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్‌ కథ ముగిసింది. తన కెరీర్‌లో 1000వ డబ్ల్యూటీఏ మ్యాచ్‌లో ఆమె పరాజయంపాలైంది. ఇటాలియన్‌ ఓపెన్‌ రెండో రౌండ్లో సెరెనా 6-7 (6-8), 5-7తో నదియా పొదరోస్కా (అర్జెంటీనా) చేతిలో కంగుతింది.

మూడు నెలల విరామం తర్వాత 39 ఏళ్ల సెరెనా బరిలోకి దిగిన తొలి టోర్నీ ఇదే. మరో మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌-2 నవోమి ఒసాకా (జపాన్‌) 6-7 (2-7), 2-6తో జెస్సికా పెగులా (అమెరికా) చేతిలో ఓడిపోయింది.

ఇదీ చదవండి:అంపైర్​పై జకోవిచ్ ఆగ్రహం- ఇటాలియన్ ఓపెన్​లో గెలుపు

ABOUT THE AUTHOR

...view details