ఇంగ్లాండ్ వెళ్లేందుకు తన కుమారుడికి, సోదరికి వీసా మంజూరు చేసే విషయమై చొరవ చూపించి సాయం చేసినందుకు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరెన్ రిజిజుకు(Rizizu) కృతజ్ఞతలు తెలిపింది టెన్నిస్ స్టార్ సానియా మీర్జా(Sania Mirza).
బర్మింగ్హామ్ ఓపెన్(జూన్ 14 నుంచి), ఈస్ట్బౌర్న్ ఓపెన్(జూన్ 20 నుంచి), వింబుల్డన్(జూన్ 28 నుంచి).. టోక్యో ఒలింపిక్స్(Olympics) కంటే ముందు జరగనున్నాయి. వీటిల్లో పాల్గొనడానికి సానియాకు ఇటీవల వీసా మంజూరైంది. అయితే ఈ టోర్నీలకు కరోనా కారణంగా తన కొడుకును తీసుకెళ్లేందుకు వీసా రాలేదు. ఈ నేపథ్యంలో ఈ విషయమై క్రీడా మంత్రిత్వ శాఖకు సంప్రదించింది టెన్నిస్ స్టార్.