భారత టెన్నిస్ స్టార్ సానిమా మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి వైదొలిగింది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్నతో కలిసి బుధవారం మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ, తొడ కండరాలు పట్టేయడం వల్ల ఆమె ఆ మ్యాచ్ నుంచి వైదొలిగింది. సానియా ఉక్రెయిన్ క్రీడాకారిణి నదియా కిచెనొక్‌తో కలిసి గురువారం మ్యాచ్‌లో పాల్గొనే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియన్ ఓపెన్: మిక్స్‌డ్ డబుల్స్ నుంచి సానియా ఔట్ - సానియా మీర్జా
ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ నుంచి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వైదొలిగింది. తొడ కండరం బాధించటం వల్లే నిష్క్రమించినట్టు తెలిపింది.
![ఆస్ట్రేలియన్ ఓపెన్: మిక్స్‌డ్ డబుల్స్ నుంచి సానియా ఔట్ Sania pulls out of Australian Open mixed doubles, but will play in women's doubles](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5806168-1041-5806168-1579715857164.jpg)
ఆస్ట్రేలియన్ ఓపెన్: మిక్స్‌డ్ డబుల్స్ నుంచి సానియా ఔట్
సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ బరిలోకి దిగిన సానియా పునరాగమనంలోనే టైటిల్ కొట్టి తనలో సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. ఇటీవల ముగిసిన హోబర్ట్ అంతర్జాతీయ టెన్నిస్ మహిళల డబుల్స్‌లో నదియాతో కలిసి ఛాంపియన్‌గా నిలిచింది.
ఇదీ చూడండి.. "టీ20 ప్రపంచకప్ గెలుపే ప్రధాన లక్ష్యం"
Last Updated : Feb 18, 2020, 1:59 AM IST