తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపియన్‌ మహోత్సవంలో సానియా మీర్జా - Summer Festival of Olympian and Paralympian Online Experiences sania mirza

ఐదు రోజుల పాటు వర్చువల్​గా జరగనున్న ఒలింపియన్ వేసవి మహోత్సవంలో భారత్ నుంచి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాల్గొనుంది.

ఒలింపియన్‌ మహోత్సవంలో సానియా మీర్జా
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా

By

Published : Jul 17, 2020, 7:05 AM IST

అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ), పారాలింపిక్‌ కమిటీ (ఐపీసీ) కలిసి వర్చువల్‌గా నిర్వహించనున్న "ఒలింపియన్‌, పారాలింపియన్‌ ఆన్‌లైన్‌ అనుభవాల వేసవి మహోత్సవం"లో భారత టెన్నిస్‌ అగ్రతార సానియా మీర్జా పాల్గొనబోతుంది.

ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌.. కరోనా కారణంగా ఇప్పటికే సంవత్సరం పాటు వాయిదా పడ్డాయి. అయితే ఆ మెగా క్రీడల స్ఫూర్తిని కొనసాగించేందుకు అథ్లెట్లతో కలిసి ఆన్‌లైన్‌లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయిదు రోజుల పాటు సాగే ఈ ఉత్సవంలో అథ్లెట్లు అంతర్జాలంలో అభిమానులతో మాట్లాడడం సహా వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ABOUT THE AUTHOR

...view details