తెలంగాణ

telangana

ETV Bharat / sports

Wimbledon: రెండో రౌండ్​కు సానియా ద్వయం - సానియా మీర్జా వింబుల్డన్​

లండన్​ వేదికగా జరుగుతోన్న వింబుల్డన్ ఓపెన్(Wimbledon​) మహిళల డబుల్స్​లో భారత టెన్నిస్​ స్టార్​ సానియా మీర్జా ద్వయం రెండో రౌండ్​కు చేరుకుంది. తొలి రౌండ్​లో 6వ సీడ్​కు చెందిన అలెక్సా - క్రాస్జిక్​ జంటపై 7-5, 6-3 తేడాతో సానియా - బెతాని జోడీ విజయం సాధించింది.

Sania Mirza makes winning return to Wimbledon, sails into second round with Mattek-Sands
Wimbledon: రెండో రౌండ్​కు సానియా ద్వయం

By

Published : Jul 1, 2021, 7:36 PM IST

వింబుల్డన్​(Wimbledon) టోర్నీ మహిళల డబుల్స్​ తొలి రౌండ్​లో భారత స్టార్​ టెన్నిస్​ క్రీడాకారిణి సానియా మీర్జా(Sania Mirza) ద్వయం విజయ కేతనం ఎగురవేసింది. 6వ సీడ్ అలెక్సా - క్రాస్జిక్ జంటపై.. సానియా - బెతాని జోడీ 7-5, 6-3 తేడాతో విజయం సాధించింది.

ఈ గెలుపుతో సానియా - బెతాని జంట(Sania Bethanie) టోర్నీలోని రెండో రౌండ్​లోకి ప్రవేశించింది. 2017 తర్వాత వింబుల్డన్​ పోటీల్లో తలపడుతున్న సానియా మీర్జా అమెరికాకు చెందిన బెథానీ మాటెక్తో జతకట్టి.. మహిళల డబుల్స్లో పాల్గొంది. ప్రస్తుతం ఈ ఇండో - అమెరికన్​ ద్వయం.. తొలి రౌండ్లో విజయం సాధించి టోర్నీలో ముందుకు దూసుకెళ్లింది.

దేశం తరఫున నాలుగుసార్లు..

టోక్యోలో జరగనున్న విశ్వక్రీడాలతో భారత్​ తరఫున నాలుగు ఒలింపిక్స్​లలో పాల్గొన్న తొలి మహిళా అథ్లెట్​గా నిలవనుంది టెన్నిస్​ స్టార్​ సానియా మీర్జా. 2018లో ఇజాన్​కు జన్మనిచ్చాక గతేడాది జనవరిలో హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్​ గెలిచి సెకండ్​ ఇన్నింగ్స్​ను ఘనంగా ప్రారంభించింది సానియా. ఈ వారమే జరిగిన ఈస్ట్​బోర్న్​ ఇంటర్నేషనల్​ ఈవెంట్​లో తొలి రౌండ్​లోనే సానియా జోడీ నిష్క్రమించింది. ప్రస్తుతం నెల వ్యవధిలో జరగనున్న వింబుల్డన్, ఒలింపిక్స్​లపై దృష్టి సారించింది. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

"కోర్టు లోపల, బయట కఠోర సాధన చేస్తున్నా. చురుకుగా, శక్తిమంతంగా ఉండటానికి శ్రమిస్తున్నా. ఒలింపిక్స్​ డబుల్స్​ విభాగంలో అంకితా రైనాతో జతకట్టడం సంతోషంగా ఉంది. టాప్​ 100లో ఉన్న భారత క్రీడాకారిణితో ఒలింపిక్స్​కు వెళ్లడం ఇదే తొలిసారి" అని సానియా తెలిపింది.

ఇదీ చూడండి..Wimbledon: మూడో రౌండ్​లోకి ప్రవేశించిన జకోవిచ్

ABOUT THE AUTHOR

...view details