భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్... బుధవారం మొదటి పుట్టినరోజు జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తన కొడుకు పుట్టినప్పుడు ఎలా ఉండేవాడో చూపిస్తూ ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది సానియా. అంతేకాకుండా తన సోదరి ఆనమ్‌తో ఇజాన్ ఆడుకుంటున్న వీడియోనూ షేర్ చేసింది. 'నా చివరి శ్వాస ఉన్నంత వరకూ నీ వెన్నంటే ఉంటా..' అని సానియా మీర్జా తన కుమారుడి గురించి భావోద్వేగంతో ఇన్స్టాలో ఓ సందేశం పెట్టింది.
"సరిగ్గా ఏడాది క్రితం ఈ ప్రపంచంలోకి వచ్చిన నువ్వు.. ఇప్పుడు నా ప్రపంచం అయ్యావు. తొలిసారి నవ్వినప్పటి సందర్భం నాకిప్పటికీ గుర్తే. నువ్వెక్కడికెళ్లినా ఇదే నవ్వును కొనసాగించాలి. నా అమేజింగ్ బాయ్..ఐలవ్యూ. నా చివరి శ్వాస వరకు నేను నీతోనే ఉంటా. జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ సాధించే విధంగా నిన్ను ఆశీర్వదించాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నా."
-- సానియామీర్జా, భారత టెన్నిస్ క్రీడాకారిణి