సబలెంక మాడ్రిడ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను చేజిక్కించుకుంది. రెండు వారాల క్రితం గాయం కారణంగా ఈ టోర్నీలో ఆడే విషయంలో సందిగ్ధత వ్యక్తం చేసి.. చివరి నిమిషంలో బరిలో నిలిచిన ఆమె ఇప్పుడు విజేతగా అవతరించింది. ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ఆష్లీ బార్టీ (ఆస్ట్రేలియా)కి షాకిచ్చి.. ఎర్రమట్టి కోర్టులో తొలి డబ్ల్యూటీఏ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది.
మాడ్రిడ్ ఓపెన్ ఛాంప్ సబలెంక - మాడ్రిడ్ ఓపెన్ 2021 ఛాంప్ సబలెంక
ఈ ఏడాది మాడ్రిడ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సబలెంక దక్కించుకుంది. ఫైనల్లో బార్టీకి షాక్ ఇచ్చి ఆమె విజేతగా నిలిచింది.
తుదిపోరులో ఈ అయిదో సీడ్ బెలారస్ భామ 6-0, 3-6, 6-4తో టాప్‌సీడ్ బార్టీని ఓడించింది. తొలి సెట్లో చెలరేగిన ఆమె ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ, బార్టీ పుంజుకుని రెండో సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో పోరు హోరాహోరీగా సాగింది. కీలక సమయాల్లో పుంజుకున్న సబలెంక.. సెట్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. ఈ పోరులో 9 ఏస్‌లు సంధించిన ఆమె.. అయిదు సార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్ చేసింది.
ఇదీ చదవండి:'ఒలింపిక్స్‌లో స్వర్ణానికి ఇదే సువర్ణావకాశం'