అమెరికన్ టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్.. యుఎస్ ఓపెన్‌లో మరో రికార్డు నెలకొల్పింది. క్వార్టర్స్‌లో చైనాకు చెందిన వాంగ్ క్వియాంగ్పై 6-1, 6-0 తేడాతో గెలిచి, ఈ టోర్నీలో 100వ విజయాన్ని నమోదు చేసింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరును 44 నిమిషాల్లోనే ముగించింది. యూఎస్ ఓపెన్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన మాజీ టెన్నిస్ ప్లేయర్ క్రిస్ ఎవార్ట్ సరసన నిలిచింది. అనంతరం మాట్లాడిన సెరెనా.. ఈ గెలుపును నమ్మలేకపోతున్నానంటూ ఆనందం వ్యక్తం చేసింది.
యూఎస్ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్ 'సెంచరీ' - serena 100th win at the US Open
ఆరుసార్లు యుఎస్ ఓపెన్ విజేత సెరెనా విలియమ్స్.. ఈ టోర్నీలో 100వ విజయాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించింది. ఇందులో టైటిల్ గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ప్లేయర్‌గా మార్గరెట్ కోర్ట్ సరసన నిలుస్తుంది.
సెరెనా విలియమ్స్
"ఈ విషయాన్ని నిజంగా నమ్మలేకపోతున్నా. 16ఏళ్ల వయసులో ఆట మెుదలుపెట్టడమే గుర్తుంది. అప్పుడే 100 మ్యాచ్‌లు గెలిచానంటే ఆశ్చర్యంగా ఉంది. గెలిస్తే ముందుకు వెళ్తా, లేకపోతే ఇంటికి వెళ్తా అని తెలుసు. అయితే నేను ఓడిపోవడానికి సిద్ధంగా లేను". -సెరెనా విలియమ్స్, టెన్నిస్ క్రీడాకారిణి
సెరెనా.. ఉక్రెయిన్‌కు చెందిన ఎలీనా స్వెతలోనాతోసెమీస్లో తలపడనుంది. గత కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న ఈ ప్లేయర్.. యూఎస్ ఓపెన్‌లో మాత్రం ఆకట్టుకునే ప్రదర్శన చేస్తోంది.
Last Updated : Sep 29, 2019, 10:14 AM IST