తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రియుడ్ని పెళ్లాడిన టెన్నిస్​ స్టార్​ ప్లేయర్​ - సిమోనా హలెప్ పెళ్లి

టెన్నిస్ క్రీడాకారిణి సిమోనా హలెప్​ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు టోనీని పెళ్లాడింది. ఈ వేడుకకు రొమేనియా అధ్యక్షుడు హాజర్యయారు.

Romania's tennis star Simona Halep marries boyfriend Toni Iuruc
ప్రియుడ్ని పెళ్లాడిన టెన్నిస్​ స్టార్​ ప్లేయర్​ హలెప్​

By

Published : Sep 16, 2021, 1:29 PM IST

రొమేనియా టెన్నిస్​ స్టార్​ ప్లేయర్​, మాజీ ప్రపంచ నెం.1 సిమోనా హలెప్​ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, వ్యాపారవేత్త టోని ఐరుక్​ను బుధవారం పెళ్లాడింది. కొవిడ్​ నిబంధనల ప్రకారం 300 మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. మాజీ టెన్నిస్​ క్రీడాకారులు ఇలీ నాస్టాసే, అయాన్​ టిరియాక్​ పాటు రొమేనియా అధ్యక్షుడు క్లౌస్​ ఐయోన్నీస్​ ఈ వేడుకకు హాజరయ్యారు.

సిమోన్​ హలెప్​.. రొమేనియా ఉత్తమ టెన్నిస్​ ప్లేయర్లలో ఒకరు. ఇప్పటివరకు రెండు గ్రాండ్​స్లామ్స్​ గెలుచుకుంది. 2018లో ఫ్రెంచ్​ ఓపెన్​, 2019లో వింబుల్డన్​ ఛాంపియన్​గా నిలిచింది. 2017, 2019లలో రెండుసార్లు ప్రపంచ నెం.1 టెన్నిస్​ క్రీడాకారిణిగా నిలిచింది.

ఇదీ చూడండి..IND Vs NZ: టీమ్​ఇండియా-న్యూజిలాండ్​ సిరీస్ వాయిదా!

ABOUT THE AUTHOR

...view details