ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఖాళీ స్టేడియంలో జరగొచ్చని ఫ్రెంచ్ టెన్నిస్ చీఫ్ బెర్నార్డ్ గ్యుడిసెల్లీ అభిప్రాయం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం మే 24 నుంచి జూన్7 మధ్య జరగాల్సిన టోర్నీ.. కరోనా ప్రభావంతో సెప్టెంబరు20 -అక్టోబర్ 4 వరకు జరపాలనుకున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వస్తున్న నేపథ్యంలో, ఈ నిర్ణయంపై ఎలాంటి మార్పు లేదని బెర్నార్డ్ స్పష్టం చేశారు.
"ఖాళీ స్డేడియంలో నిర్వహించడం తప్ప మాకు మరో అవకాశం లేదు. ఆటగాళ్లకు ఈ టోర్నీ ఎంతో ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది దీని కోసం వేచిచూస్తున్నారు. వారు లేకుండా నిర్వహించడం వ్యాపార నమూనాలో ఓ భాగమే. ప్రసారహక్కుల ద్వారా ఆదాయం వస్తుంది."