తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫ్రెంచ్‌ ఓపెన్: అప్పుడు 5 లక్షలు.. ఇప్పడు 5 వేలు

టెన్నిస్‌ అభిమానులకు శుభవార్త చెప్పింది ఫ్రెంచ్​ టెన్నిస్​ సమాఖ్య. ఈ ఏడాది ఫ్రెంచ్​ ఓపెన్​ను​ అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు అవకాశం ఇస్తోంది. అయితే కేవలం 5వేల మంది ప్రేక్షకులకే ఈ ఛాన్స్​ దక్కనుంది.

french open latest dates
ఫ్రెంచ్‌ ఓపెన్: అప్పుడు 5 లక్షలు.. ఇప్పడు 5 వేలు

By

Published : Sep 8, 2020, 7:53 AM IST

కరోనా భయం వెంటాడుతున్నప్పటికీ ఫ్రెంచ్‌ ఓపెన్‌కు ప్రేక్షకులను అనుమతించాలని నిర్వాహకులు నిర్ణయించడం విశేషం. మే నెలలో జరగాల్సిన ఈ టోర్నీ.. వైరస్‌ కారణంగానే వాయిదా పడింది. ఏడాదిలో రెండో గ్రాండ్‌స్లామ్‌గా జరగాల్సిన ఈ టోర్నీని.. యూఎస్‌ ఓపెన్‌ తర్వాత ఏడాది చివర్లో నిర్వహించనున్నారు.

గతేడాది 5 లక్షలకు పైగా..

ఫ్రాన్స్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నా సరే.. సెప్టెంబరు 27న పారిస్‌లో ఆరంభమయ్యే ఈ టోర్నీకి ప్రేక్షకులను అనుమతించనున్నట్లు నిర్వాహకులు సోమవారం ప్రకటించారు. ఈవెంట్​లో భౌతిక దూరం పాటిస్తూనే.. 5 వేల మంది వీక్షకులు మ్యాచ్​లు చూడనున్నారు. అయితే గతేడాది ఫ్రెంచ్​ ఓపెన్​లోని ఓ మ్యాచ్​కు ఏకంగా 5 లక్షల 20 వేల మంది హాజరు కావడం విశేషం.

ప్రపంచ నెం.1 లేకుండానే...

కరోనా భయంతో​ యూఎస్​ ఓపెన్ టెన్నిస్​ టోర్నీ నుంచి వైదొలిగిన ఆస్ట్రేలియా ప్లేయర్, ప్రపంచ నం.1 ర్యాంకర్​​ యాష్​ బార్టీ... ఫ్రెంచ్​ ఓపెన్​ నుంచి తప్పుకుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఐరోపా దేశానికి ప్రయాణం కష్టతరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అంతేకాదు తన కోచ్​ అందుబాటులో లేకపోవడం వల్ల పూర్తిస్థాయి శిక్షణ పూర్తవలేదని తెలిపింది. ఒకవేళ టోర్నీలో పాల్గొనాలనుకుంటే ప్రభుత్వం నుంచి బార్టీ అనుమతి పొందాలి. ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చిన తర్వాత ప్రయాణికులు రెండు వారాల నిర్భంధాన్ని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇన్ని అవాంతరాలను దృష్టిలో పెట్టుకొని టోర్నీ నుంచి వైదొలిగింది బార్టీ.

ఇదీ చూడండి: అంపైర్​ను కొట్టిన జకోవిచ్.. టోర్నీ నుంచి ఔట్

ABOUT THE AUTHOR

...view details