భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ను సాధించాడు. నెదర్లాండ్ ఆటగాడు వెస్లీ కూలాఫ్‌తో కలిసి బోపన్న 'ఖతర్ ఓపెన్ ఏటీపీ 250' టోర్నీలో విజేతగా నిలిచాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో బాంబ్రిడ్జ్ (ఇంగ్లాండ్)-శాంటియాగో (మెక్సికో) జంటని బోపన్న జోడీ 3-6, 6-2, 10-6 తేడాతో ఓడించింది.
ఖతర్ ఓపెన్ విజేతగా బోపన్న జోడీ - బాంబ్రిడ్జ్ (ఇంగ్లాండ్)-శాంటియాగో (మెక్సికో)
భారత టెన్నిస్ డబుల్స్ ఆటగాడు బోపన్న ఖతర్ ఓపెన్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో బాంబ్రిడ్జ్-శాంటియాగో జంటని బోపన్న జోడీ ఓడించింది.
![ఖతర్ ఓపెన్ విజేతగా బోపన్న జోడీ బోపన్న జోడీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5673019-thumbnail-3x2-bop.jpg)
Rohan Bopanna
ఈ విజయంతో బోపన్న జోడీ 76,870 డాలర్ల ప్రైజ్‌మనీతో పాటు 250 ఏటీపీ ర్యాంకింగ్ పాయింట్లు గెలుచుకుంది. బోపన్న ఖాతాలో 19వ డబుల్స్ టైటిల్ ఇది. సెమీఫైనల్లో బోపన్న-కూలాఫ్ జంట 7-5, 6-2 తేడాతో హెన్రీ కొంటినెన్ (ఫిన్‌లాండ్)- స్కుగోర్ (క్రొయేషియా) జోడీపై విజయం సాధించింది.
ఇవీ చూడండి.. 47వ పడిలోకి ద్రవిడ్.. మరపురాని ఇన్నింగ్స్‌పై ఓ లుక్కేయండి