రోజర్స్కప్ ఫైనల్లో కెనడా యువ క్రీడాకారిణి బియాంకా ఆండ్రెస్కు సత్తా చాటింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్(అమెరికా)ను ఓడించి రోజర్స్ కప్ టైటిల్ను గెలుచుకుంది.
వెన్నునొప్పితో వెనుదిరిగిన సెరెనా...
మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన సెరెనాపై 3-1 తేడాతో విజయం అందుకుందీ 19 ఏళ్ల అమ్మాయి. తొలి సెట్లో 3-1 తేడాతో వెనుకంజలో ఉన్న సెరెనా నడుంనొప్పితో మ్యాచ్ ఆడలేకపోయింది. అనంతరం రిఫరీ.. బియాంకాను విజేతగా ప్రకటించారు. మ్యాచ్ కొనసాగించలేకపోయిందుకు సెరెనా కంటతడి పెట్టుకుంది. బియాంకా.. సెరెనాను కౌగిలించుకుని ఓదార్చింది.