స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్(Roger Federer) ఫ్రెంచ్ ఓపెన్(French open) నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ప్రకటించాడు. మోకాలి గాయంతో బాధపడుతున్న రోజర్.. ప్రస్తుత టోర్నీలో నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు.
"నా టీమ్‌తో చర్చించాక ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నాను. నా మోకాళ్లకు జరిగిన శస్త్రచికిత్స కారణంగా శరీరానికి విశ్రాంతి అవసరం"