స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ దుబాయ్ ఏటీపీ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఖతార్ ఓపెన్లో క్వార్టర్ఫైనల్లో ఓటమి పాలైన ఫెదరర్.. ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. 'మళ్లీ శిక్షణకు వెళ్లడం మంచిదని' పేర్కొన్నాడు.
"ఏటీపీ టూర్కు తిరిగి రావడం చాలా బాగుంది. దోహాలో ఆడిన ప్రతి క్షణాన్ని ప్రేమించాను. నేనిక్కడి వరకు రావడానికి కృషి చేసిన వైద్యబృందానికి ధన్యవాదాలు. ఖతార్ ఓపెన్లో ఫలితం చూశాక తిరిగి శిక్షణకు వెళ్లాలనిపిస్తుంది. వచ్చే వారం దుబాయ్ వేదికగా జరిగే ఏటీపీ టోర్నీ నుంచి తప్పుకుంటున్నా."