టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్.. ఆస్ట్రేలియా ఓపెన్‌కు అందుబాటులో ఉండట్లేదు. ఈ ఏడాది అతడికి మోకాలి శస్త్రచికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో విశ్రాంతి తీసుకుంటూ ఫిట్నెస్ పెంచుకోవాలని అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అందుకే ఈ టోర్నీకి రోజర్ దూరమయ్యాడు.
ఆస్ట్రేలియా ఓపెన్‌కు ఫెదరర్ దూరం
స్టార్ టెన్నిస్ ప్లేయర్ ఫెదరర్.. 2021 ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరమయ్యాడు. ఇటీవల అతడికి మోకాలి శస్త్రచికిత్స జరగడమే ఇందుకు కారణం.
ఫెదరర్
టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌లలో మొదటగా నిర్వహించే ఆస్ట్రేలియా ఓపెన్.. 2021 ఫ్రిబ్రవరి 8 నుంచి మొదలు కానుంది. షెడ్యూల్ ప్రకారం జనవరి 18న ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌లను ఫిబ్రవరి 8 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నట్లు ఇటీవల ఏటీపీ(అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్)ప్రకటించింది. కరోనా, క్వారంటైన్ నిబంధనలే ఈ పోరును ఆలస్యంగా నిర్వహించడానికి కారణంగా తెలిపింది. ఈ మేరకు 2021 టూర్ క్యాలెండర్‌ను విడుదల చేసింది.
ఇదీ చూడండి : నాలో ఇంకా కొంత ఆట ఉంది: ఫెదరర్