క్రీడాకారులు సినిమాలు చూస్తారా? అని చాలా మందికి సందేహం. వారికున్న బిజీ షెడ్యూల్లో సమయం దొరకడమే కష్టం.. ఒకవేళ దొరికినా కుటుంబంతో గడపేందుకే ఇష్టపడతారు. ఇక స్టార్ ప్లేయర్లు సినిమాలేం చూస్తారు అనుకునే వాళ్లు లేకపోలేదు. వీటికి చెక్ పెడుతూ ఓ ప్రశ్న అడిగాడు టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్. ఓ బాలీవుడ్ సినిమా వీక్షించాలని ఉందని అడిగిన ఈ ఆటగాడు.. మంచి క్లాసిక్ చిత్రమేదైనా ఉంటే చెప్పాలని ట్విట్టర్లో అభిమానులను కోరాడు.
తమ అభిమాన ఆటగాడు అడిగిందే తడవుగా సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. 'బాహుబలి' సినిమా చూడాల్సిందిగా ఎక్కువ మంది సూచించారు. 'షోలే', 'దిల్వాలే దుల్హనియే లేజాయేంగే', 'దీవార్', 'హీరా ఫెరీ', 'జోధా అక్బర్', 'లగాన్' లాంటి సినిమాలు చూడాల్సిందిగా కామెంట్లు పెట్టారు.