టోక్యో ఒలింపిక్స్‌లో టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ పాల్గొనడం అనుమానంగానే ఉంది. సోమవారం (జూన్ 28) నుంచి జరగనున్న వింబుల్డన్ పూర్తి అయిన తర్వాతే ఒలింపిక్స్‌పై స్పష్టత వస్తుందని ఫెదరర్ శనివారం ప్రకటించాడు. వచ్చే రెండు వారాల్లో పరిస్థితులను బట్టి తన నిర్ణయం ఉంటుందని చెప్పాడు.
"ఒలింపిక్స్‌లో ఆడతానని కచ్చితంగా చెప్పలేను. వింబుల్డన్‌లో నా ప్రదర్శన వేసవి ప్రణాళికలపై ప్రభావం చూపుతుంది. ఒలింపిక్స్‌కు వెళ్లి, వీలైనన్ని ఎక్కువ టోర్నమెంట్లు ఆడాలని ఉంది. అయితే వింబుల్డన్ తర్వాత నా టీమ్‌తో చర్చించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటా"