స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ (Roger Federer) మరోసారి మోకాలి సర్జరీ చేయించుకోనున్నాడు. దీంతో ఆగస్టు 30 నుంచి జరిగే యూఎస్ ఓపెన్‌కు (US Open) దూరం కానున్నాడు. చివరిసారిగా వింబుల్డన్ సందర్భంగా రాకెట్ పట్టిన ఈ స్టార్ ప్లేయర్.. మోకాలి గాయం వల్ల టోక్యో ఒలింపిక్స్‌లో ఆడలేదు.
"వింబుల్డన్ తర్వాత జరిగిన పరిణామాలపై మీకు కొంత సమాచారం ఇవ్వాలనుకుంటున్నాను. నా మోకాలి గాయానికి సంబంధించి డాక్టర్లను కలిశాను. చాలా చెకప్‌లు చేయించాను. నాకు సర్జరీ అవసరమని వారు సూచించారు. అందుకు నేను సిద్ధపడ్డాను. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారు" అని ఇన్‌స్టా వేదికగా పోస్టు చేసిన ఓ వీడియోలో ఫెదరర్ పేర్కొన్నాడు.