ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ ఆటగాడు, 20 గ్రాండ్‌స్లామ్‌ల విజేత రోజర్ ఫెదరర్‌కు అమెరికా కుర్రాడు చెమటలు పట్టించాడు. ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో దాదాపు ఓడించినంత పనిచేశాడు. అతడి ఆటకు దాసోహం అనక తప్పని పరిస్థితి నుంచి బయటపడ్డాడు ఫెదరర్. ఆఖరి సెట్లో కాస్త పుంజుకొని 15వ సారి ఆస్ట్రేలియా ఓపెన్ సెమీస్‌కు చేరి తన అనుభవం ఏంటో చాటాడు.
మెల్‌బోర్న్ నగరంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. స్విస్ కెరటం రోజర్ ఫెదరర్ అమెరికా కుర్రాడు టెన్నెస్ సాండ్‌గ్రెన్ (100 ర్యాంకు) పోరాటం ఉత్కంఠను తారస్థాయికి తీసుకెళ్లింది. నువ్వా-నేనా అన్నట్టు సాగిన ఈ పోరులో రోజర్ 6-3, 2-6, 2-6, 7-6 (10/8), 6-3 తేడాతో ఎంతో శ్రమించి విజయం అందుకున్నాడు.
టెన్నెస్ సాండ్‌గ్రెన్, ఫెదరర్ తొలిసెట్‌ను అలవోకగా గెలిచిన అతడికి రెండు, మూడు సెట్లలో చుక్కెదురైంది. ఆ తర్వాత ఫెదరర్ సర్వీసుల్లో వేగం తగ్గింది. గంటకు సగటు వేగం 112 మైళ్ల నుంచి 105 మైళ్లకు పడిపోయింది. అప్పటికే అనవసర తప్పిదాలు 30కి చేరాయి.
నాలుగో సెట్లో సాండ్‌గ్రెన్ 5-4తో ఆధిక్యంలో ఉండటం వల్ల అతడిదే విజయమని అంతా భావించారు. కీలక సమయంలో అతడు మూడు పొరపాట్లు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. పదో గేమ్ పాయింట్ వద్ద ఫెదరర్ చేసిన మొదటి సర్వీస్‌ను సాండ్‌గ్రెన్ నెట్‌కు కొట్టాడు. రెండో సర్వీస్‌ను ఫోర్‌హ్యాండ్‌తో కోర్టు బయటికి పంపించాడు. మళ్లీ మూడో సర్వీస్‌ను నెట్‌కే కొట్టాడు. 6-3, 6-4, 6-5, 7-6 వద్ద అతడు రోజర్ సర్వీస్‌లను బ్రేక్ చేయలేకపోయాడు. టై బ్రేకర్‌లో బాల్‌బాయ్ చూసుకోకుండా పరిగెత్తడం వల్ల సాండ్‌గ్రెండ్ అదుపు తప్పాడు. రావాల్సిన పాయింట్ రాలేదు. చివరికి నాలుగో సెట్ 10/8 తేడాతో ఫెదరర్ వశమైంది. ఆఖరి సెట్‌ను అతడు సునాయసంగా గెలుచుకున్నాడు.
మళ్లీ ఆ ముగ్గురే...
పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో జరిగిన మరో పోరులో కెనడా ఆటగాడు మిలోస్ రోనిక్‌ను 6-4, 6-3, 7-6 (7-1) తేడాతో సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్ సునాయాసంగా ఓడించాడు. ఇతడు రఫెన్ నాదల్‌తో తలపడనున్నాడు. వీరిద్దరిలో గెలిచిన ఆటగాడు ఫెదరర్‌తో తలపడనున్నాడు.
మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో ట్యునీషియా అమ్మాయి ఆన్స్ జబెయుర్‌పై 6-4, 6-4 తేడాతో సోఫియా కెనిన్ (అమెరికా) గెలిచింది. ప్రపంచ నంబర్ వన్ ఆష్లే బార్టీ 7-6 (8/6), 6-2 తేడాతో చెక్ సీనియర్ క్రీడాకారిణి పెట్రా క్విటోవాను ఓడించింది.