ఏడాది విరామం తర్వాత పునరాగమనం చేసిన స్విస్ మాస్టర్ రోజర్ ఫెదరర్ ఒక్క విజయంతో సరిపెట్టుకున్నాడు. ఖతార్ ఓపెన్లో అతడు క్వార్టర్ఫైనల్లోనే నిష్క్రమించాడు. రెండో సీడ్ ఫెదరర్ 6-3, 1-6, 5-7తో బసిల్ష్విలి (జార్జియా) చేతిలో ఓడిపోయాడు.
ఖతార్ ఓపెన్: క్వార్టర్ ఫైనల్లోనే ఫెదరర్ ఓటమి - khatar open
స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్.. ఖతార్ ఓపెన్లో ఉసూరుమనిపించాడు. ఏడాది తర్వాత కోర్టులోకి అడుగుపెట్టిన రోజర్.. క్వార్టర్ఫైనల్లోనే పరాజయం పాలయ్యాడు. జార్జియా ప్లేయర్ బసిల్ష్విలి చేతిలో ఓడిపోయాడు.
దోహ ఓపెన్: క్వార్టర్ ఫైనల్లోనే ఓటమి పాలైన ఫెదరర్
తొలి సెట్ గెలిచి జోరు మీద కనిపించిన రోజర్.. రెండో సెట్‌ను పేలవంగా 1-6తో కోల్పోయాడు. మూడో సెట్లో పోరాడినా పదకొండో గేమ్‌లో సర్వీస్ చేజార్చుకుని ఓటమి చవిచూశాడు. ఈ టోర్నీలో ఫెదరర్ ఒకే విజయం సాధించాడు. తొలి రౌండ్లో అతడికి బై లభించింది.
ఇదీ చదవండి:పొట్టి కప్పు దారిలో ఓ గట్టి సిరీస్
Last Updated : Mar 12, 2021, 7:51 AM IST