స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్(Roger Federer) ఫ్రెంచ్ ఓపెన్(French open) నుంచి వైదొలగనున్నాడు. మోకాలి గాయంతో బాధపడుతున్న రోజర్.. ప్రస్తుత టోర్నీలో నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు.
"ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆటను కొనసాగించే విషయమై నేను నిర్ణయం తీసుకోవాలి. గాయం ప్రమాదకరమా? కాదా? అనేది ఆలోచించాలి. ప్రతి మ్యాచ్ అనంతరం నా మోకాలు ఎలా ఉందో చూస్తున్నాను. నేను ఆడతానో లేదో తెలీదు."
-రోజర్ ఫెదరర్, స్విట్జర్లాండ్ టెన్నిస్ క్రీడాకారుడు.
మూడో రౌండ్లో లిథువేనియా ఆటగాడు రికార్డాస్ బెర్కిన్స్పై విజయం సాధించి నాలుగో రౌండ్‌కు అర్హత సాధించాడు ఫెదరర్. తదుపరి ఇటలీ ప్లేయర్ మాటియో బెరెట్టినితో తలపడునున్నాడు. ఇప్పటికే 20 గ్రాండ్ స్లామ్‌లు గెలుపొందిన రోజర్.. 2020లో రెండు మోకాళ్లకు శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు.
ఇదీ చదవండి:French Open: ఓటమితో స్వితోలినా ఇంటిముఖం