ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్.. ఆస్ట్రేలియా ఓపెన్‌కు సిద్ధమయ్యాడు. నేటి(సోమవారం) నుంచి జరిగే ఈ టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. ప్రస్తుతం అక్కడే ఉన్న ఇతడు, తన సిబ్బందితో దాగుడుమూతలు(హైడ్ అండ్ సీక్) ఆడూతూ కనిపించాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
చిన్నపిల్లాడిలా దాగుడుమూతలాడిన రోజర్ ఫెదరర్ - Australian Open
స్టార్ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్.. తన సిబ్బందితో దాగుడుమూతలు ఆడుతూ కనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
స్టార్ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్
ఈ వీడియోలో ఫెదరర్.. తన కోచ్ సెవరిన్ లుతీ, ఫిట్నెస్ కోచ్ పియర్రే పగనినితో హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాడు. ఈ టోర్నీలోని తొలి రౌండ్లో ప్రపంచ 81వ ర్యాంక్ ప్లేయర్ స్టీవ్ జాన్సన్(అమెరికా)తో తలపడనున్నాడు ఫెదరర్. ఇప్పటివరకు ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెల్చుకున్న ఇతడు.. ఇందులోనూ గెలిచి, గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల సంఖ్యను 21కి పెంచుకోవాలని చూస్తున్నాడు.