తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫెదరర్ కొత్త రికార్డ్​... ఈ సీజన్​లో హాఫ్​ సెంచరీ - 50 atp tour games

అత్యధిక గ్రాండ్​స్లామ్​ల విజేత రోజర్ ఫెదరర్.. స్విస్ ఇండోర్ ఛాంపియన్​షిప్​ సెమీస్​లో నెగ్గాడు. ఈ గెలుపుతో ఈ సీజన్​లో 50 విజయాన్ని అందుకున్నాడు. గ్రీస్​కు చెందిన స్టెఫానోపై గెలిచి ఫైనల్​ చేరాడు.

ఫెదరర్​

By

Published : Oct 27, 2019, 9:54 AM IST

ఈ సీజన్​లో ఫెదరర్ ఖాతాలో 50 విజయాలు

స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ వరుస రికార్డులతో దూసుకెళ్తున్నాడు. తాజాగా బాసెల్ వేదికగా జరిగిన స్విస్ ఇండోర్ ఛాంపియన్​షిప్​ సెమీస్​ మ్యాచ్​లో గెలిచి ఈ సీజన్​లో 50వ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. గ్రీస్​కు చెందిన స్టెఫానో సిట్సిపాస్​పై గెలిచి ఫైనల్​కు దూసుకెళ్లాడు.

6-4, 6-4 తేడాతో 3వ సీడ్ స్టెఫానోను ఓడించాడు రోజర్. ఓ సీజన్​లో 50 ఏటీపీ టూర్ విజయాలు అందుకోవడం ఫెదరర్​కు ఇది 16వ సారి. ఇప్పటివరకు జరిగిన ఈ టోర్నీల్లో వరుసగా 23వ మ్యాచ్​లు గెలిచిన రికార్డూ రోజర్​ దక్కించుకున్నాడు.

"బాసెల్​ టోర్నీలో మరో ఫైనల్​ ఆడబోతున్నానంటే నమ్మలేకపోతున్నా. ఎంతో ఆనందంగా ఉంది. గేమ్​ను బాగా ఎంజాయ్ చేశా. ప్రతి పాయింట్​ కోసం మెరుగైన ప్రదర్శన చేస్తుంటే ఫలితం దక్కుతుంది. సొంత మైదానంలో ఉన్న ప్రయోజనమిదే" - రోజర్ ఫెదరర్​, స్విస్ టెన్నిస్ ప్లేయర్.

ఆదివారం జరగబోయే తుదిపోరు స్విస్ దిగ్గజానికి 157వ టూర్ ఫైనల్ అవుతుంది. ఇప్పటికే 20 గ్రాండ్​స్లామ్​లు గెలిచి అత్యధిక టైటిల్స్​ నెగ్గిన టెన్నిస్ ప్లేయర్​గా రికార్డు సృష్టించాడు ఫెదరర్. తాజాగా ఈ ఘనతనూ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇదీ చదవండి: ఫ్రెంచ్​ ఓపెన్​ ఫైనల్లో సాత్విక్ - చిరాగ్ జోడీ

ABOUT THE AUTHOR

...view details