దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు రఫెల్ నాదల్ ఈ ఏడాది జరుగనున్న వింబుల్డన్, టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు. తన టీంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.
"సుదీర్ఘ కెరీర్ కోసం పాటుపడటం, నాకు నచ్చినట్టుగా ఉండటమే నా లక్ష్యం. వీటి కోసం కష్టపడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తా. రోలాండ్ గారోస్(ఫెంచ్ ఓపెన్), వింబుల్డన్ మధ్య రెండు వారాల వ్యవధి మాత్రమే ఉంది. ఇంత తక్కువ సమయంలో కోలుకోవడం అంత తేలిక కాదు."