తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫెదరర్​పై గెలుపు- ఫ్రెంచ్​ ఓపెన్​ ఫైనల్లో రఫా - rafael

ఫ్రెంచ్ ఓపెన్​ సెమీస్​లో ఫెదరర్​పై గెలిచి ఫైనల్​కు దూసుకెళ్లాడు రఫెల్ నాదల్. ఇప్పటివరకు 11 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన రఫా 12వ టైటిల్​పై గురిపెట్టాడు.

రఫెల్

By

Published : Jun 7, 2019, 7:32 PM IST

Updated : Jun 7, 2019, 9:08 PM IST

సెమీస్​లో ఫెదరర్​పై నెగ్గిన రఫా

ఫ్రెంచ్ ఓపెన్- 2019లో రఫెల్ నాదల్ మరోసారి సత్తాచాటాడు. చిరకాల ప్రత్యర్థి రోజర్​ ఫెదరర్​పై సెమీస్​లో గెలిచి ఫైనల్​కు దూసుకెళ్లాడు. 6-3, 6-4, 6-2 తేడాతో స్విస్​ దిగ్గజంపై విజయం సాధించాడు రఫా. ఫ్రెంచ్​ ఓపెన్​లో వరుసగా 22వ మ్యాచ్​ గెలిచాడీ స్పెయిన్ బుల్​.

పురుషుల సింగిల్స్​ సెమీస్​లో తొలి సెట్​ను సులభంగా గెలిచాడు నాదల్ . రెండో సెట్​లో ఫెదరర్​ గట్టి పోటినిచ్చాడు. అయితే నాదల్ పట్టువదలకుండా ఆడి రెండో సెట్​లోనూ విజయం సాధించాడు. మూడో సెట్​ ఏకపక్షంగా సాగింది. వరుస పాయింట్లు సాధించి మ్యాచ్​ సొంతం చేసుకున్నాడు రఫా.

మట్టి కోర్టులో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు రఫెల్. ఇప్పటివరకు 11 సార్లు ఫ్రెంచ్​ ఓపెన్​ విజేతగా నిలిచిన ఈ డిఫెండింగ్ ఛాంపియన్ 12వ టైటిల్​పై గురిపెట్టాడు. మరో సెమీస్​ మ్యాచ్​​ జకోవిచ్ - థీమ్​కు మధ్య జరుగుతోంది. ఇందులో గెలిచినవారిపై తుదిపోరులో తలపడనున్నాడు రఫా.

Last Updated : Jun 7, 2019, 9:08 PM IST

ABOUT THE AUTHOR

...view details