తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఫెదరర్‌కు చేపలు పట్టడం నేర్పిస్తా' - ఫెదరర్‌కు చేపలు పట్టడం నేర్పిస్తా

టెన్నిస్​ దిగ్గజం రోజర్​ ఫెదరర్​కు చేపలు పట్టడం నేర్పిస్తానని అంటున్నాడు మరో అగ్రశ్రేణి ఆటగాడు రఫెల్​ నాదల్​. సామాజిక మాధ్యమంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చాడు నాదల్​.

Rafael Nadal says he will teach  fish hunting to  Tennis player   Roger Federer
ఫెదరర్‌కు చేపలు పట్టడం నేర్పిస్తా

By

Published : Apr 27, 2020, 7:21 AM IST

టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌కు సంబంధించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మరో అగ్రశ్రేణి ఆటగాడు రఫెల్‌ నాదల్ ఆసక్తికరంగా స్పందించాడు. "స్పానిష్‌, చేపలు పట్టడం, వంట చేయడం.. ఈ మూడింట్లో ఫెదరర్‌కు మీరు సులభంగా ఏది నేర్పించగలనని అనుకుంటున్నారు?" అని అభిమాని ట్విట్టర్‌లో అడిగిన ప్రశ్నకు నాదల్‌ ఇలా బదులిచ్చాడు.

"ఫెదరర్‌కు సులభంగా నేర్పించేది.. బహుశా చేపలు పట్టడమే. తన పిల్లలతో కలిసి చెరువుకు వెళ్లి చేపలు పట్టడం తనకిష్టమని గతంలో అతను నాతో చెప్పాడు. అతను స్పానిష్‌ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కొన్నిసార్లు మాట్లాడాలని కూడా చూశాడు. అతని వంట గురించి మాత్రం నాకు తెలీదు. ఎందుకంటే ఇంతవరకూ అతను నాకు ఏం వండిపెట్టలేదు. అతడి వంట నైపుణ్యాల గురించి నాకు అవగాహన లేదు"

ABOUT THE AUTHOR

...view details