ఏటీపీ ఫైనల్స్‌లో నాదల్ సెమీస్ ఆశలు సజీవం ఏటీపీ ఫైనల్స్‌లో సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకున్నాడు స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్. రౌండ్ రాబిన్ విధానంలో జరుగుతోన్న ఈ టోర్నీ తొలి రౌండ్లోనే ఓటమిపాలైన రఫా.. మళ్లీ పుంజుకున్నాడు. రష్యాకు చెందిన డేనియల్ మెద్వదేవ్‌పై నెగ్గాడు నాదల్. మరో మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంటాడు.
లండన్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో 6-7(3), 6-3, 7-6(4) తేడాతో మెద్వదేవ్‌తో విజయం సాధించాడు నాదల్. శుక్రవారం.. గ్రీస్‌కు చెందిన స్టెఫానోస్ సిట్సిపాస్‌తో తలపడనున్నాడు. అతడిని ఓడించి సెమీస్ చేరుకోవాలని తహతహలాడుతున్నాడు నాదల్.
మ్యాచ్ పాయింట్‌కు 1-5 తేడాతో వెనుకంజలో ఉన్న నాదల్ తన పోరాట పటిమతో మరోసారి ఆకట్టుకున్నాడు. మెద్వదేవ్.. తన సర్వీసును రెండు సార్లు బ్రేక్ చేసినా తడబడకుండా పోరాడాడు. సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లోనే జర్మన్ క్రీడాకారుడు జ్వెరేవ్ చేతిలో పరాయం పాలయినప్పటకీ తనదైన శైలిలో సత్తాచాటాడు.
19 గ్రాండ్‌స్లామ్‌లను కైవసం చేసుకున్న ఈ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ ఒక్కసారి కూడా ఏటీపీ ఫైనల్స్‌లో గెలవలేదు. ఒలింపిక్స్‌లో స్వర్ణాన్నీ నెగ్గిన నాదల్కు.. ఈ టైటిల్ అందని ద్రాక్షలా మిగిలింది. ఇంకో రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఏటీపీ ఫైనల్స్ టోర్నీ తుదిపోరుకు అర్హత సాధిస్తాడు.
ఇదీ చదవండి: లంచ్ విరామానికి.. బంగ్లా టాపార్డర్ పెవిలియన్‌కు