ఏటీపీ ఫైనల్స్‌లో స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్ గ్రూప్ తొలి మ్యాచ్‌లో నాదల్ 6-3, 6-4తో కొత్త కుర్రాడు ఆండ్రీ రుబ్‌లెవ్ (రష్యా)ను ఓడించాడు. ఈ పోరులో రెండు ఏస్‌లు కొట్టిన రఫా.. రెండుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి విజయాన్ని అందుకున్నాడు.
ఏటీపీ ఫైనల్స్‌లో నాదల్, జకోవిచ్ ముందంజ - రఫెల్ నాదల్ వార్తలు
లండన్‌లో జరుగుతున్న ఏటీపీ ఫైనల్స్‌లో టెన్నిస్ దిగ్గజాలు రఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్ శుభారంభం చేశారు. సింగిల్స్‌లో ఆండ్రీ రుబ్లెవ్‌పై నాదల్ పైచేయి సాధించగా.. డిగో స్క్వాట్జ్‌మ్యాన్‌పై జకోవిచ్ విజయం సాధించాడు.

ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో రోజర్ ఫెదరర్ సరసన నిలిచిన నాదల్.. 1000 ఏటీపీ విజయాలూ పూర్తి చేసుకున్నాడు. మరో మ్యాచ్‌లో టాప్‌సీడ్ జకోవిచ్ 6-3, 6-2తో డిగో స్క్వాట్జ్‌మ్యాన్ (అర్జెంటీనా)ను ఓడించాడు. ఈ టోర్నీలో అయిదుసార్లు విజేతగా నిలిచిన నొవాక్.. అత్యధికసార్లు ఈ టైటిల్ గెలిచిన ఫెదరర్ (6) రికార్డును సమం చేయాలనే ఉత్సాహంతో ఉన్నాడు. ఇంకో పోరులో డొమినిక్ థీమ్ (కెనడా) నెగ్గాడు. అతను 7-6 (7-5), 4-6, 6-3తో డిఫెండింగ్ ఛాంపియన్ సిట్సిపాస్ (గ్రీస్)ను ఓడించాడు.