భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంది. ఏడాది తర్వాత బరిలోకి దిగిన సానియా.. ఖతార్ ఓపెన్‌లో మహిళల డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
సోమవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సానియా, ఆండ్రెజా క్లెపాక్ (స్లొవేనియా) జోడీ 6-4, 6-7(5), 10-5తో ఉక్రెయిన్ ద్వయం నడియా కిచెనోక్, ల్యుద్మైలా కిచెనోక్పై విజయం సాధించింది.
తొలి సెట్ నాలుగో గేమ్‌లో 0-3తో వెనుకబడ్డ సానియా, క్లెపాక్ జంట ఆ తర్వాత పుంజుకుంది. పదునైన సర్వ్‌లతో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడుతూ పోటీలోకి వచ్చి మొదటి సెట్‌ను దక్కించుకుంది. మళ్లీ కిచెనోక్ సిస్టర్స్ ప్రతిఘటించగా.. మ్యాచ్ రసవత్తరంగా మారింది. టైబ్రేకర్‌కు దారి తీసిన రెండో సెట్‌ను గెలిచి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది సానియా జోడీ.