ఛాంపియన్లను తయారు చేయడం తన కల అని, రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఈ పని చేయాలనుకుంటున్నానని అన్నాడు భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్. ప్రస్తుతం ఇలానే రాణిస్తున్న రాహుల్ ద్రవిడ్, పుల్లెల గోపీచంద్ తనకు ఆదర్శమని చెప్పాడు.
'వారిలా ఛాంపియన్లను తయారు చేయాలనుకుంటున్నా' - పుల్లెల గోపీచంద్
రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత దేశానికి గర్వకారణంగా నిలిచే ఛాంపియన్లను తయారు చేయాలనుకుంటున్నానని చెప్పాడు దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్. వారిద్దరే తనకు ఆదర్శమన్నాడు.
"జీవితంలో ఏదైనా కొత్తగా చేయడం చాలా ముఖ్యం. ఇప్పటికే రెండో ఇన్నింగ్స్‌లో చాలా చేశాను. భవిష్యత్తులో నేను శిక్షణనిచ్చే అథ్లెట్లు.. గ్రాండ్‌స్లామ్ గెలవాలని, ఒలింపిక్స్‌కు వెళ్లాలని కోరుకుంటున్నా. కొంతమంది మాజీలు చూస్తుంటే నాకు గౌరవంగా ఉంది. రాహుల్ ద్రవిడ్, పుల్లెల గోపీచంద్ లాంటి వారు.. తాము రిటైర్ అయిన తర్వాత యువ క్రీడాకారులను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్నారు. వారిలా నేను కావాలనుకుంటున్నా" -లియాండర్ పేస్, దిగ్గజ టెన్నిస్ ప్లేయర్
రాహుల్ ద్రవిడ్... భారత్ ఏ, టీమిండియా అండర్-19 జట్టుకు కోచ్‌గా ఉంటూ అద్భుతమైన ఫలితాలు సాధించాడు. గోపీచంద్.. సైనా నెహ్వాల్, పీవీ సింధు వంటి ఒలింపిక్ విజేతల్ని తీర్చిదిద్దాడు. లియాండర్ పేస్.. ఎనిమిదిసార్లు పురుషుల మిక్స్డ్ డబుల్స్ విభాగంలో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు అందుకున్నాడు