తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆ రికార్డు కోసం ఎనిమిదోసారి ఒలింపిక్స్​ ఆడతా..' - భారత టెన్నిస్​ ప్లేయర్​ లియాండర్​ పేస్​ న్యూస్​

క్రీడా టోర్నీలు పునః ప్రారంభమైన తర్వాత తనలో కొత్తదనాన్ని చూస్తారని అంటున్నారు భారత స్టార్​ టెన్నిస్​ ప్లేయర్​ లియాండర్​ పేస్​. వచ్చే ఏడాది కెరీర్​లో తన ఎనిమిదవ ఒలింపిక్స్​ ఆడనున్నట్లు తెలిపాడు. ఈ టోర్నీ తర్వాత ఆటకు వీడ్కోలు ప్రకటించనున్నట్లు పరోక్షంగా వెల్లడించాడు లియాండర్​ పేస్​.

Paes ready with his 'new version' but concerned about Tokyo Games
'నా కెరీర్​లో 8వ ఒలింపిక్స్​.. ఆటలో కొత్త దనాన్ని చూస్తారు'

By

Published : Jun 20, 2020, 7:32 PM IST

కరోనా నేపథ్యంలో బంద్​ అయిన పలు క్రీడాటోర్నీలు.. నెమ్మదిగా ప్రారంభమవుతున్నాయి. ఆటగాళ్లంతా మళ్లీ శిక్షణలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. టెన్నిస్​ క్రీడాటోర్నీలు ప్రారంభమైతే... మరింత జోష్​తో బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు భారత దిగ్గజ టెన్నిస్​ ప్లేయర్​ లియాండర్​ పేస్. తన కెరీర్​లో ఎనిమిదో ఒలింపిక్స్​ ఆడి చరిత్ర సృష్టించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

​బుధవారం తన 47వ జన్మదిన వేడుకలను సాదాసీదాగా జరుపుకొన్నారు లియాండర్​ పేస్​. ఈ ఏడాది ఆటకు వీడ్కోలు పలికే ఆలోచనలో ఉన్న తనకు.. కరోనా అడ్డుతగిలిందని అందుకే ప్రణాళికలు మార్చుకుంటున్నట్లు తెలిపారు.

"ఒలింపిక్స్​ నిర్వహణ గురించి నేను నిజంగా ఆందోళన చెందుతున్నాను. ఎందుకంటే అది నా చరిత్రకు, వారసత్వానికి సంబంధించింది. టోక్యో ఒలింపిక్స్​లో నా చివరి ప్రదర్శన చేయాలనుకున్నాను. కానీ, ఈ ఏడాది జరగాల్సిన టోర్నీ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైన పరిస్థితుల్లో ఒలింపిక్స్​కు​ స్పాన్సర్ చేయడానికి ఏ కార్పొరేట్​ సంస్థ ముందుకొస్తుంది? అయినా ఒలింపిక్స్​ను నిర్వహించడానికి జపాన్​ ప్రభుత్వం ఇప్పటికీ సుముఖత చూపిస్తుంది. ముఖ్యంగా తలుపులు మూసేసి నిర్వహించాలనుకుంటోంది. కానీ, స్టేడియాలన్నీ ఖాళీగా ఉంటే రెవెన్యూ ఎక్కడ నుంచి వస్తుంది. ఇదే మనం ఎదుర్కొవాల్సిన పెద్ద సమస్య".

-లియాండర్​ పేస్​, భారత టెన్నిస్​ ప్లేయర్​

2021లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్​లో బరిలోకి దిగితే.. ఎనిమిదిసార్లు ఈ మెగా టోర్నీలో ఆడిన తొలి టెన్నిస్‌ ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తారు పేస్​.కెరీర్​లో మొత్తం 54 టైటిల్స్​ గెలిచిన ఈ భారత దిగ్గజం..​ 18 గ్రాండ్​స్లామ్ డబుల్స్​ ట్రోఫీలు సొంతం చేసుకున్నారు. డెవిస్​కప్​లో అత్యధిక డబుల్స్ టైటిల్స్(44) నెగ్గిన క్రీడాకారుడిగా పేస్ పేరిటే రికార్డు ఉంది.

ఇదీ చూడండి: ఒలింపిక్స్​ రికార్డు పోయినా.. గ్రాండ్‌స్లామ్‌ల శతకం కొడతా!

ABOUT THE AUTHOR

...view details